Header Banner

ఐర్లాండ్‌లో ఘనంగా వాసవి అమ్మవారి జయంతి ఉత్సవాలు! సంబరాల్లో చిన్నారుల అద్భుత ప్రతిభ!

  Tue May 13, 2025 08:02        Others

శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా మహా పరాభట్టారిక స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వైశాఖ శుద్ధ దశమి నాటి ఉత్సవాన్ని వారాంతంలో స్థానిక VHCCI ఆలయం నందు నిర్వహించారు., కార్యక్రమంలో ముందుగా అమ్మవారి అభిషేకాన్ని శివకుమార్, మాధవి దంపతుల సహకారంతో నిర్వహించారు, పిమ్మట విద్యనాథ్ రజిత మరియు కళ్యాణ్ ఇనిస్ దంపతుల సహకారంతో అమ్మవారికి విశేషమైన పుష్పాలంకరణ వస్త్రాలంకరణ సేవలు నిర్వహించారు. పిమ్మట శీతల్ కుమార్, వర్షిణి దంపతుల ప్రోత్సాహంతో అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు, హిందూ ధర్మంలో గోమాత పూజ ఏంతో విశేషమైన క్రతువు అందుచేత అమ్మవారి జన్మదినోత్సవం నాడు ఇక్కడ పవన్ కుమార్ గారి సహకారంతో శాస్రోక్తంగా గోపూజలు నిర్వహించారు, తరువాత కార్యక్రమంలో చిన్నపిల్లలకి కుమారి పూజ నిర్వహించారు, శ్రీనివాస్, సరిత మరియు సంతోష్ విన్య దంపతులు కన్యలందరికి బహుమతులు తాంబూలాలతో సత్కరించి ఆశీర్వచనం అందుకొన్నారు, తదుపరి మహిళలందరూ అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి సహకారం అందించిన జ్ఞాన ప్రకాష్, మహాలక్ష్మి దంపతులను పినాక శర్మ గారు ప్రత్యేక వైదిక ఆశీర్వచనం అందజేశారు.

తదుపరి శిరీష, కవిత, రేణుక మొదలగు వారి ఆధ్వర్యంలో అమ్మవారి విశేష పారాయణ కార్యక్రమం నిర్వహించారు. అటుపిమ్మట అమ్మవారికి ఆణివారం నిర్వహించారు, ఈ కార్యక్రమాలకు స్థానిక వ్యాపార సంస్థలైన డెస్టినీ ఐర్లాండ్, టీం దుకాణ్, తాలి రెస్టారెంట్, ఇండియన్ వైబ్ రెస్టారెంట్, TEST TRIANGLE మొదలగు వారందరు సహకరించిన ఈ సాంస్కృతిక కార్యక్రమానికి వ్యాఖ్యానకర్తలుగా చిరంజీవి లక్ష్మి హాసిని మరియు శ్రీమతి మౌనిక గార్లు నడిపించారు. చిన్నపిల్లలు ఏంతో ఉత్సాహంగా అన్నమాచార్య కీర్తనలు, అమ్మవారి పాటలు మరియు నృత్య కళాప్రదర్శనాలతో సభికులందరిని భక్తిపారవశ్యంలో నింపారు, పిల్లలందరికీ పినాక శర్మ గారు ప్రత్యేక ఆశీర్వచనం అందించారు. కార్యక్రమంలో చివరిగా అమ్మవారి ప్రసాద వితరణ మరియు బోజనవిందు కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి శ్రీకిరణ్, నీరజ, శ్రీనివాస్ సుధా, ఝాన్సీ, శ్రీనివాస్, శిరీష, రఘు, కవిత, వెంకట్ జూలూరి తదితరులందరు సహాయ సహకారాలను అందించారు.

చివరిగా అపూర్వ చారిటీ సంస్థ తరుపున ప్రవీణ్ గారు నూతనంగా నిర్మించబోయే హిందూ దేవాలయం గురించి మరియు అందులో వాసవి అమ్మవారికి కూడా ఉపాలయం ఉంటుందని చెప్పగా, జయంతి కార్యక్రమ నిర్వాహుకుల్లో ప్రధానంగా నిలిచిన నరేంద్ర కుమార్ గారు మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమాలకు మనవంతు సహాయం చేసి మన ధర్మాన్ని ప్రపంచ నలుమూలల నిలబెట్టాలని, స్వీయ సంపాదనలో కొంతమొత్తం ప్రతిఒక్కరు ధార్మిక సేవకు వినియోగించాలని నొక్కి చెప్పారు, కార్యక్రమం విజయవంతమయ్యేందుకు కృషి చేసిన వారిలో మొదటగా సంతోష్, శ్రీనివాస్ వెచ్చ, భార్గవ్, మాణిక్, కళ్యాణ్, రేణుక, మన్మోహన్, శివ, హేమంత్, జయరాం, తృప్తి, కావ్య, సాగర్, మాధురి లు పాల్గొని విజయవంతంగ ముగించారు.

ఇది కూడా చదవండి22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #VasaviJayanthi2025 #IrelandCelebrations #VasaviDevi #CulturalFest #BhaktiUtsav #KidsPerformances #IndianTraditionAbroad